చండీగఢ్, అక్టోబర్ 11: హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాని ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సురీందర్ సింగ్ భోరియాను నియమించింది. పూరన్ కుమార్ ఆత్మహత్యపై విమర్శలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్ పోలీస్ చీఫ్ సాగర్ ప్రీత్ హుడా ఇప్పటికే ప్రకటించారు. తన భర్త ఆత్మహత్యకు రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలే కారణమని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. దీంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.