Haryana elections : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆద్యంతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం తెలిపింది.
హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. అంతకుముందే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకేసారి అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. కచ్చితమైన పోలింగ్ శాతం తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని ఈసీ తెలిపింది.