Haryana elections : హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ (Election commission) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో విడతల వారీగా పోలింగ్ నిర్వహించారు.
అక్కడ సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరిగింది. హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు ఇవాళే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 8న ఓట్లను లెక్కించి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు.
#WATCH | Hisar: Mock Polling visuals from New Yashoda Public School, Hisar assembly seat.
BJP’s Dr Kamal Gupta, JJP’s Ravinder Ravi Ahuja, Congress’s Ram Niwas Rara, INLD’s Shyam Lal and AAP’s Sanjay Satrodia are fielding from this seat. pic.twitter.com/UdPDzSRHgd
— ANI (@ANI) October 5, 2024