న్యూఢిల్లీ: హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని (Yamuna Water) తాగినట్లు నటించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నోట్లోని నీటిని వెంటనే ఊమ్మేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలోకి ప్రవహించే యమునా నదిలో విష పదార్థాలను హర్యానా కలుపుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. హర్యానా నుంచి వచ్చే నీటిలో విషపూరిత అమోనియా ఉన్నట్లు తెలిపారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఖండించారు. బుధవారం ఢిల్లీ శివారు గ్రామంలో యమునా నదిలోని నీటిని దోసిళ్లలోకి తీసుకుని ఆయన తాగారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ దీనిపై గురువారం స్పందించారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగినట్లు నటించారని విమర్శించారు. నోటిలోని నీటిని తిరిగి యమునా నదిలోకి ఉమ్మేశారని ఆరోపించారు. అమోనియా కాలుష్యం కారణంగా యమునా నీరు ఢిల్లీ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందన్న తనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘తాము తాగలేని అదే విషపూరిత నీటిని ఢిల్లీ ప్రజలతో తాగించాలని వారు కోరుకుంటున్నారు. నేను ఎప్పటికీ ఇది జరుగనివ్వను’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగి ఊసేసిన వీడియో క్లిప్‌ను అందులో పోస్ట్ చేశారు.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
అయితే ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను అరవింద్ కేజ్రీవాల్ షేర్ చేశారని హర్యానా బీజేపీ ఆరోపించింది. అబద్ధాలు, మోసాల అద్దాలు తీసి ఆ వీడియోను మళ్ళీ చూడాలని సూచించింది. మీకు ధైర్యం ఉంటే ఢిల్లీ వైపు నుంచి యమునా నీటిని తాగడానికి ప్రయత్నించాలని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. ఎడిటెడ్, నిజమైన వీడియో అంటూ ఒక క్లిప్‌ను షేర్ చేసింది.
झूठ और फरेब का चश्मा उतारो और दोबारा वीडियो देखो केजरीवाल और अगर हिम्मत है तो दिल्ली की तरफ का यमुना का पानी पीकर दिखाओ
राजनीतिक जगत के अब तक के सबसे नीच बयानों का कीर्तिमान कपटी केजरीवाल स्थापित कर रहा है।
केजरीवाल जी आप तो खुद हरियाणा के कपूत हो और आप जानते हो कि हरियाणा के… https://t.co/FrF3QLLeLx pic.twitter.com/L2r6XWRmMP
— Haryana BJP (@BJP4Haryana) January 29, 2025