చండీగఢ్: కారులో వెళ్తున్న బీఎస్పీ నేతపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. (BSP Leader Shot Dead) దీంతో బీఎస్పీ నేత హత్యపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హర్యానాలోని నరైన్గఢ్లో ఈ సంఘటన జరిగింది. హర్యానాలోని అంబాలాకు చెందిన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి హర్బిలాస్ సింగ్ రజ్జుమజ్రా శుక్రవారం రాత్రి తన స్నేహితులైన పునీత్, గుగల్తో కలిసి కారులో ప్రయాణించారు.
కాగా, నరైన్‌గఢ్ ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఆ కారుపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో హర్బిలాస్ సింగ్ రజ్జుమజ్రా, ఆయన స్నేహితుడు పునీత్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు వారిని తరలించారు. చికిత్స పొందుతూ హర్బిలాస్ సింగ్ అర్ధరాత్రి వేళ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పునీత్‌కు ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నరైన్‌గఢ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రజ్జుమాజ్రా హత్యపై బీఎస్పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హంతకులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
కాగా, హర్బిలాస్ సింగ్‌పై కాల్పులకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని ఆయన విమర్శించారు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ నేరాలు ప్రబలుతాయని ఆరోపించారు.
हरियाणा की भाजपा सरकार पूरे प्रदेश की क़ानून व्यवस्था की बात करती है लेकिन हक़ीक़त में मुख्यमंत्री नायब सिंह सैनी का गृह क्षेत्र भी सुरक्षित नहीं।
सीएम के खुद के इलाके में ताबड़तोड़ गोलियां चली,बसपा नेता हरबिलास जी की सरेबाजार हत्या कर दी गई।
मुख्यमंत्री के गृह क्षेत्र सहित… pic.twitter.com/DcO8JaUofr
— Randeep Singh Surjewala (@rssurjewala) January 25, 2025
#अतिदुखद – बसपा हरियाणा के प्रदेश सचिव हरबिलास रज्जूमाजरा जी पर गोलियों से अज्ञात बदमाशों ने हमला किया एवं उनकी मृत्यु हो गई ।
तत्काल हरियाणा प्रशासन को इस घटना को संज्ञान में लेकर बदमाशों के ऊपर सख़्त से सख़्त कार्यवाही करनी चाहिए @police_haryana @DGPHaryana @bspforharyana pic.twitter.com/mjaZEgxlxc
— BSP (@Bsp4u) January 24, 2025