ఢిల్లీ నూతన ఎల్జీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్‌కి తీవ్ర అవమానం జరిగింది. దీంతో ఆయన కోపగించి, వాకౌట్ చేశారు. ఎంపీకి కనీసం సీటు కూడా కేటాయించలేదని, తీవ్ర అసహనంతో ఆయన సభా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
ఢిల్లీ నూతన ఎల్జీగా వినయ్ కుమార్ సక్సెనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్.. వినయ్ కుమార్‌తో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ హర్షవర్ధన్ కూడా హాజరయ్యారు. అయితే.. ఆయనకు సీటు కేటాయించలేదు. చాలా సేపు చూసి… చూసి… ఆయన ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. తనకు సీటు కూడా కేటాయించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.