న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక పోస్ట్‌లను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా (Harsh Goenka)లేటెస్ట్ పోస్ట్ పలువురిని ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేయాలని ఆయన కోరకుంటున్నారు. మన తప్పుల నుంచే కొత్త విషయాలను నేర్చుకోగలుగుతామని అందుకే అందరూ పొరపాట్లకు తావివ్వాలని ఆయన అంటున్నారు.
ఆయన తన వాదనకు మద్దతుగా ఓ గ్రాఫ్‌ను పోస్ట్ చేశారు. కొత్త విషయాలను ప్రయత్నించడం, నేర్చుకోవడం, ముందుకు నడవడం, మనల్ని మనం మార్చుకోవడం మీ ప్రపంచాన్ని మార్చడం వంటివి పొరపాట్లతోనే సాధ్యమవుతాయని ఈ పోస్ట్‌లో 65 ఏండ్ల పారిశ్రామిక దిగ్గజం రాసుకొచ్చారు.
I hope you make mistakes. Because if you are making mistakes, then you are making new things, trying new things, learning, living, pushing yourself, changing yourself, changing your world. pic.twitter.com/lNwOyE8fwr
— Harsh Goenka (@hvgoenka) February 20, 2023
హర్ష్ గోయంకా ఆలోచనలతో పలువురు నెటిజన్లు ఏకీభవించారు. పొరపాట్లు చేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో పొరపాటు చేస్తే అది దీర్ఘకాలం మనకు నష్టాన్ని మిగుల్చుతుందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :