న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలని రాజ్యాంగ నిపుణుడు, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే పిలుపునిచ్చారు. ఈ పదాలను దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న కాలం 1976లో చేర్చారని చెప్పారు.
ఈ పదాలను రాజ్యాంగంలో చేర్చడం అనవసరమని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు తమ దృష్టిని, ధ్యాసను రాజ్యాంగ రచన కోసం అంకితం చేశారని, అన్ని రకాల రాజ్యాంగబద్ధ రక్షణలను పెట్టారని, వారు చేర్చని పదాలైన లౌకికవాదం, సామ్యవాదంలను మీరు ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అంబేద్కర్, బీఎన్ రా వు వంటి ప్రభావశీలురు రాజ్యాంగానికి రూపకల్పన చేశారని, వారికి ఆం గ్లంపై గట్టి పట్టు ఉందని, అయినప్పటికీ, వారు ఈ పదాలను రాజ్యాంగంలో చేర్చలేదని గుర్తు చేశారు.