రాహుల్‌గాంధీపై హార్దిక్ పటేల్ పరోక్ష విమర్శలు
అహ్మదాబాద్, మే 18: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ మాత్రం ధ్యాస లేదని ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. గుజరాతీల సమస్యలను విన్నవించడానికి తాను ఎప్పుడు వెళ్లినా కాంగ్రెస్ పెద్దలు ఫోన్లలో ముఖాలు పెట్టుకొని బిజీగా ఉంటారని, దేశానికి విపక్ష నాయకుల అవసరం ఉన్నప్పుడు విదేశాల్లో పర్యటిస్తారని పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ విమర్శించారు.
అధిష్ఠానం నిర్వహించే సమావేశాల్లో చికెన్ శాండ్విచ్లను అందిస్తూ సీనియర్ల మెప్పును పొందడానికే గుజరాత్ కాంగ్రెస్ నేతలు పరిమితమవుతున్నారని, అసలు సమస్యలపై ఏ మాత్రం పోరాడటంలేదన్నారు. పార్టీ సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌కు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. హార్దిక్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు.