Chennai | చైన్నైలో(Chennai) దారుణం చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై(17-year-old student) ఆరుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పరీక్షల్లో ఫెయిల్ అయిన సదరు విద్యార్థిని మళ్లీ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో చదువుకునేందుకు స్నేహితురాలి ఇంటికి వెళ్లిన బాలికపై ఆమెకు తెలిసిన స్నేహితుడు కన్నేసాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని పోరూరు సమీపంలోని కెరుగంబాక్కం ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు.
అప్పటికే అక్కడి కి చేరుకున్న మరో ఐదుగురితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టి పారిపోయారు. తీవ్ర అస్వస్థతకు గరైన బాలికను ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై జరిగి ఘోరాన్ని వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోరూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికత్స కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.