న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్యాటగిరి నుంచి 46.5 శాతం ఉండగా, ఓబీసీకి చెందిన వారు 29.4 శాతం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16.33 శాతం, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 7.83 శాతం మంది ఉన్నారు. డీఎంకే ఎంపీ పీ విల్సన్ ప్రశ్నకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను రాతపూర్వకంగా పార్లమెంటుకు వెల్లడించారు.