న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. కొవిడ్ మహమ్మారి సమయం మినహాయించి, 30 ఏళ్ల కనిష్ఠానికి తగ్గింది. సౌదీ అరేబియా హజ్ శాఖ ఎక్స్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 16,73,230 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లారు. నిరుడు కన్నా 1.6 లక్షల మంది తగ్గిపోయారు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం వల్ల కొందరు ముస్లింలు హజ్ యాత్రకు దూరంగా ఉన్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, కఠిన నిబంధనలు కూడా యాత్రికులను వెనుకంజ వేసేలా చేసి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.