న్యూఢిల్లీ : మధ్య భారతంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ప్రజలను బాధిస్తున్నది. గురువారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుగా బుధవారం నిలిచింది. అలాగే మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలోని రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎంపీలోని సాగర్లో 42.5, మహారాష్ట్రలోని అకోలాలో 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.