న్యూఢిల్లీ: తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడానికి సహాయం కోసం తాను అడుక్కోవలసి వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) వాపోయారు. తన బ్యాంకు ఖాతాలో పది లక్షలు ఉన్నప్పటికీ ఈడీ ఫ్రీజ్ చేయడంతో ఈ దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనతా కీ అదాలత్’ సభలో మనీష్ సిసోడియా మాట్లాడారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ చేసి ఏడాదిన్నరపాటు జైలులో ఉంచిన తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ‘నన్ను విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రయత్నించారు. అరవింద్ కేజ్రీవాల్ నన్ను ఇరికించారని నాకు చెప్పారు. మనీష్ సిసోడియా పేరును అరవింద్ కేజ్రీవాల్ చెప్పారని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ పేరు చెబితే మీరు బయటపడతారని జైలులో నాతో అన్నారు’ అని మండిపడ్డారు.
కాగా, బీజేపీలోకి మారడానికి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని సిసోడియా తెలిపారు. పార్టీ మారకపోతే తనను జైలులో చంపేస్తారని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. ‘నా గురించి ఆలోచించమని, రాజకీయాల్లో ఎవరూ ఎవరి గురించి ఆలోచించరని నాకు చెప్పారు. నా కుటుంబం గురించి, అనారోగ్యంతో ఉన్న నా భార్య, కాలేజీలో చదువుతున్న నా కుమారుడి గురించి ఆలోచించమని నాకు చెప్పారు’ అని విమర్శించారు. అయితే రాముడి నుంచి లక్ష్మణుడ్ని దూరం చేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారని, ప్రపంచంలో ఏ రావణుడికి ఇలా చేసే శక్తి లేదని తాను చెప్పానన్నారు.
మరోవైపు 26 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ తన సోదరుడు, రాజకీయ గురువు అని మనీష్ సిసోడియా అన్నారు. ఆప్‌ను విచ్ఛిన్నం చేసేందుకే తనను, పార్టీ సహచరులను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అయితే తమతోపాటు పార్టీని కూడా వారు విచ్చిన్నం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగానే తాను కూడా ఎన్నికల్లో ప్రజా తీర్పు తర్వాతే ఢిల్లీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపడతానని సిసోడియా స్పష్టం చేశారు.
हम अरविंद केजरीवाल के सिपाही हैं, ना झुकेंगे और ना टूटेंगे🔥
हमारे नेताओं को जेल में दिल्ली की जनता के काम रोकने के लिए डाला गया। हमारी सरकार और पार्टी को तोड़ने के लिए जेल में डाला गया। लेकिन मैं बड़े गर्व से कह रहा हूं कि ना ही हमारी पार्टी टूटी और ना ही सरकार गिरी।
मुझे आम… pic.twitter.com/X2BPFCDSPg
— AAP (@AamAadmiParty) September 22, 2024
#WATCH | AAP leader Manish Sisodia says, “…They (opposition) used to say that you don’t know but Arvind Kejriwal has implicated you…When we did not do anything wrong why would he take my name? I used to say that you are trying to separate Lakshman from Rama…No Ravana can… pic.twitter.com/sLBkiiKRtt
— ANI (@ANI) September 22, 2024