H3N2 | అసోంలో H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సీజనల్ ఇన్ఫ్లుఎంజా పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అసోంలో సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు 452 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కర్ణాటకలో ఒకరు, హర్యానాలో ఒకరు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సైతం వైరస్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తున్నది. అలాగే గుజరాత్‌కు చెందిన ఓ మహిళ సైతం మంగళవారం ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.