హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : అమెరికాలో హెచ్-1బీ వీసా రుసుం పెంపుదలకు మనదేశ ప్రధాని మోదీ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భారత్‌పై తరచూ విరుచుకుపడుతున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
5 వేల డాలర్లలోపు ఉన్న హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ రుసుం పెంపుతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.