న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) పేరు ఖరారైంది. సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. ఒక పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ను నియమించనున్నట్టు సమాచారం.
మరో వైపు కొత్త సీఈసీ ఎంపిక కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కోరారు. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన అంశం ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నదని, కాబట్టి రెండు రోజులు సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.