Gurugram | ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కన్న దంపతులు.. డీఎన్ఏ టెస్టులో సంచలన విషయం వెల్లడి
Gurugram : ఐవీఎఫ్ ప్రక్రియపై అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హరియాణాలో గుర్గావ్ (గురుగ్రామ్)లో మరో సంచలన విషయం బయటపడింది. కొన్ని నెలల క్రితం ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కన్న దంపతులకు ఆ పిల్లలు తమ పిల్లలు కాదని తెలిసింది.
Gurugram : ఐవీఎఫ్ ప్రక్రియపై అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హరియాణాలో గుర్గావ్ (గురుగ్రామ్)లో మరో సంచలన విషయం బయటపడింది. కొన్ని నెలల క్రితం ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కన్న దంపతులకు ఆ పిల్లలు తమ పిల్లలు కాదని తెలిసింది. ఇటీవల జరిపిన డీఎన్ఏ టెస్టులో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ విషయం బయటపడటంతో దేశంలో ఐవీఎఫ్ ప్రక్రియపై, దీని చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.
గుర్గావ్కు చెందిన ఒక జంటకు సంతానం కలగలేదు. దీంతో వారు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించారు. అందులో ఒక సంస్థ వారికి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు అంగీకరించారు. ఇందుకోసం ఆ జంట నుంచి అండం, శుక్రకణాల్ని సేకరించారు. అనంతరం ఐవీఎఫ్ విధానంలో ఈ జంట కవల పిల్లల్ని కన్నారు. కొద్దిరోజుల క్రితం పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో వారు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ జెనెటిక్ పరీక్షలు కూడా అవసమరయ్యాయి. ఇలా జెనెటిక్, డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా సంచలన విషయం బయటపడింది. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదని తేలింది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి డీఎన్ఏతో ఆ పిల్లల డీఎన్ఏ మ్యాచ్ కాలేదు. అటు తండ్రి డీఎన్ఏ, ఇటు తల్లి డీఎన్ఏ.. ఇద్దరిలో ఎవరిలోనూ లేదు.
ఆ పిల్లలు తమ పిల్లలే అని సూచించే ఇతర పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వారికి వ్యతిరేకంగానే వచ్చాయి. పైగా పుట్టిన పిల్లలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లల్లా ఉన్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బాధితుడైన రాహుల్ రాథోడ్ ముందుగా ఐవీఎఫ్ సెంటర్ను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బయోలాజికల్ పిల్లలు తమకు కావాలని, ఐవీఎఫ్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఐవీఎఫ్ సెంటర్పై చర్యకు ఆదేశించింది. అక్కడి రికార్డుల్ని సీజ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోంది. అయితే, దేశంలో కొనసాగుతున్న ఐవీఎఫ్ సెంటర్ల నిర్వహణా తీరుపై, నైతికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

