కరోనా ఎఫెక్ట్ : సోమ్నాథ్ ఆలయంలో దర్శనాల నిలిపివేత
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్లైన్ ద్వారానే దర్శనం చేసుకునేందుకు ట్రస్టు అవకాశం కల్పించింది.

అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. పాజిటివ్ కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పార్కులు, బీచ్లు, మాల్స్పై పరిమితులు విధించగా.. ప్రస్తుతం ఈ ప్రభావం ఆలయాలపైనా పడింది.
గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది.
భక్తులు కేవలం ఆన్లైన్ ద్వారానే దర్శనం చేసుకునేందుకు ట్రస్టు అవకాశం కల్పించింది.
ప్రధాన ఆలయంతోపాటు ట్రస్టు పరిధిలోని అనుబంధ ఆలయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నట్లు ట్రస్టు తెలిపింది.
ఆలయంలో నిర్వహించే హారతి కార్యక్రమాన్ని భక్తులు ఆలయ సోషల్ మీడియా పేజ్లో వీక్షించవచ్చని సోమ్నాథ్ ట్రస్టు జనరల్ మేనేజర్ విజయ్ సింగ్ చౌదా తెలిపారు.
ఆలయం ఎప్పుడు తెరవనున్నది త్వరలో అధికారులు ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గుజరాత్లో 22,692 యాక్టివ్ కేసులున్నాయి.
వారాంతపు కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

