అహ్మదాబాద్: ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికంగా వేధించాడు. హాస్టల్లో నివసిస్తున్న ఆ బాలుడ్ని తన రూమ్‌కు తీసుకెళ్లి అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (principal’s son absued Student) గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన బాలుడు ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదివాడు. ప్రిన్సిపాల్ కుమారుడు అతడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత బాలుడిని తన గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధించాడు. అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు.
కాగా, పదో తరగతి బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత ఆ బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ కుమారుడు అతడ్ని సంప్రదించడంతో పాటు లైంగిక చర్యలకు ఒత్తిడి చేశాడు. దీంతో ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం, ప్రతిభపై ఇది ప్రభావం చూపింది.
మరోవైపు ఆ బాలుడి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతడ్ని ప్రశ్నించగా ప్రిన్సిపాల్ కుమారుడి లైంగిక వేధింపుల గురించి చెప్పాడు. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.