గాంధీనగర్: ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఎక్స్ఈ వేరియంట్ (Corona XE variant) గుజరాత్లో (Gujarat) వెలుగుచూసింది. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్‌ను గుర్తించారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడని అధికార వర్గాలు సమాచారం అందించాయి. అతనికి మార్చి 13న కరోనా పాజిటివ్ వచ్చిందని, వారం రోజుల్లోనే అతడు కోలుకున్నాడని చెప్పారు. ఇప్పుడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని వెల్లడించారు.
కరోనా సరికొత్త రూపం ఎక్స్ఈని మొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇది ఒమిక్రాన్ కంటే వేంగంగా వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కాగా, దేశంలో తొలి ఎక్స్ఈ కేసు ముంబైలో గుర్తించారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అయితే ఈ వార్తను కేంద్ర ఆరోగ్యశాఖ ఖడించింది.