అహ్మదాబాద్: మద్యాన్ని చూసి బీజేపీ మంత్రి ఆగలేకపోయారు (BJP Minister Raghavji Patel). గిరిజన ఆచారాన్ని పాటించకుండా ఆకులో పోసిన మద్యాన్ని తాగేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా డేడియాపాడలోని ఆదర్శ విద్యార్థి శాలలో గిరిజన ఆచారాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. మంత్రి రాఘవ్జీ పటేల్, మరి కొందరు బీజేపీ నేతలు ఇందులో పాల్గొన్నారు.
కాగా, గిరిజన ఆచారంలో భాగంగా భూమాతకు సమర్పించేందుకు మంత్రి రాఘవ్జీ పటేల్, ఇతర బీజేపీ నేతలు చేతుల్లో పట్టుకున్న ఆకుల్లో గిరిజన పూజారి మద్యం పోశారు. అయితే మంత్రి రాఘవ్జీ పటేల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మద్యాన్ని నోట్లో పోసుకుని తాగారు. మిగతా వారు మాత్రం ఆకులో ఉన్న మద్యాన్ని భూమాతకు సమర్పించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గిరిజన ఆచారాన్ని పాటించక ఆకులోని మద్యాన్ని తాగిన బీజేపీ మంత్రి రాఘవ్జీ పటేల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. గిరిజన ఆచారాల గురించి తనకు తెలియవని అన్నారు. ఆకులో పోసిన మద్యాన్ని తీర్థంగా భావించి తాగినట్లు చెప్పారు.
ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દારૂને ચરણામૃત સમજીને પી ગયા#gujaratinews #raghavjipatel #raghavji #gujaratcabinet #gujaratgovt #gujaratnews @RaghavjiPatel pic.twitter.com/48tcLjq1QY
— Janta Ni Jamavat (@Jantanijamavat) August 10, 2023