Ratan tata | గుజరాత్ ప్రభుత్వం (Gujarat govt) కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మృతికి (Ratan Tata) గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా (one day of mourning) ప్రకటించింది. జాతీయ జెండాను అవనతం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని తెలిపింది. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Gujarat govt has declared one day of mourning in respect of Ratan Tata today. The national flag will be flown at half mast and no cultural or entertainment programme of the govt will be held today: Gujarat Govt
— ANI (@ANI) October 10, 2024
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు పూర్తికానున్నాయి. మరోవైపు రతన్ టాటాకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు కడసారి నివాళులర్పించారు.
Also Read..
Ratan Tata | రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం.. వర్లీ ప్రాంతంలో అంత్యక్రియలు