Gujarat Election-2022 | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడుదల్లో జరుగనున్నాయి. మొదటి దశలో డిసెంబర్ 8న 89 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల నోటిఫికేషన్ జారీ కాగా.. ఈ నెల 14తో నామినేషన్ల ఘట్ట ముగియనున్నది. 15 నామినేషన్ల పరిశీలన, 17వ వరకు ఉపసంహరణకు అవకాశం ఉన్నది. అయితే, మొదటి దశ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 447 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది.
మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కతర్గాం నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల కోసం విరాళాలు సేకరణను ప్రారంభించారు. వడోదరకు చెందిన సయాజిగంజ్ ఆప్ అభ్యర్థి స్వైజల్ వ్యాస్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం మద్దతుదారుల నుంచి విరాళాలను సేకరించారు. సోషల్ మీడియాలో ద్వారా ఆయన ప్రచారం నిర్వహించగా రెండుగంటల్లోనే రూ.9వేలు వసూలయ్యాయి. పలువురు మద్దతుదారులు సైతం ఆయనకు విరాళాలు అందజేశారు. రూ.11వేలు, రూ.51వేలు పంపిన ఇద్దరు మద్దతుదారులు పంపగా.. ఇందులో నుంచి కేవలం ఒక్కో రూపాయిని స్వీకరించి.. మిగతా మొత్తాన్ని వారికే తిప్పి పంపారు.
ప్రజల సహకారంతో సేకరించిన మొత్తం నుంచే సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లిస్తానని పేర్కొన్నారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులంతా మొదటి దశ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ సీఎం అభ్యర్థి ఇసుగాన్ గధ్వీ ఖంభాలియా నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి నాలుగో లిస్ట్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 104 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.