e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News గుజరాత్‌లో భూకంపం.. ఇండ్ల నుంచి పరుగులు పెట్టిన జనం

గుజరాత్‌లో భూకంపం.. ఇండ్ల నుంచి పరుగులు పెట్టిన జనం


అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాజ్‌కోట్‌కు దగ్గరలోని గోండాల్‌లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.4తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. ప్రకంపనలతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి నివేదికలు అందలేదు. ఇంతకు ముందు వేకువ జామున ఉత్తరాఖండ్‌లోని ఫితోర్‌గఢ్‌లోనూ రిక్టర్‌ స్కేల్‌పై 2.5తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఫితోర్‌గఢ్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.

ఇదిలా ఉండగా.. సిస్మిక్‌ జోన్‌-5లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై ఎనిమిది నుంచి తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. గుజరాత్‌ సిస్మిక్‌-3 జోన్‌లో ఉందని, ఇక్కడ భూకంపం ఏడు అంతకంటే తక్కువ తీవ్రతతో వస్తాయని నిపుణులు తెలిపారు. ఇదే కేటగిరిలో కేరళ, గోవా, లక్షద్వీప్, యూపీ, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలు, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement