న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెరర్రిస్టు స్కాడ్(ఏటీఎస్) భగ్నం చేసింది. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ఏటీఎస్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులకు పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
అనుమానితులపై ఏడాది కాలంగా నిఘా ఉంచినట్టు తెలిపారు. వారు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగానే ఆయుధాల మార్పిడి కోసం అనుమానితులు గుజరాత్‌కు వచ్చారని తెలిపారు.