న్యూఢిల్లీ: వరకట్నం కోసం వేధింపులు జరుగుతున్న ఈ కాలంలో ఓ యువకుడు ఆదర్శాన్ని చాటాడు. పెండ్లి సందర్భంగా అత్తమామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగి ఇచ్చేశాడు. వరుడి సూచనమేరకు కేవలం రూపాయి నాణెం, ఒక కొబ్బరి కాయతో మొత్తం వివాహ క్రతువును పూర్తి చేశారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో గత నెల 30న జరిగింది.యూపీలోని సహరాన్పూర్ జిల్లా బాబ్సి రాయ్పూర్ గ్రామానికి చెందిన వికాస్ రాణా, వరకట్నాన్ని వధువు తల్లిదండ్రులకు ఇచ్చేసి, వధువే ఒక కట్నమని భావిస్తామని చెప్పాడు.