Karnataka | బెంగళూరు: తాళి కట్టిన వెంటనే గుండెపోటుతో వరుడు మరణించిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బాగల్కోట్లో శనివారం జరిగిన ఒక వివాహంలో 25 ఏండ్ల ప్రవీణ్ పెండ్లి కుమార్తెకు తాళి కట్టిన కొద్ది నిముషాలకు గుండెల్లో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. బంధువులు అతడిని వెంటనే దవా ఖానాకు తరలించగా, అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
ఇటీవల యువతకు గుండెపోట్లు వచ్చి మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తున్నది. ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్లో 23 ఏండ్ల యువతి నృత్యం చేస్తూ గుండెపోటుతో స్టేజిపై మరణించింది. నిరుడు డిసెంబర్లో 14 ఏండ్ల బాలుడు కూడా గుండెపోటుతో మరణించాడు.