బెంగళూరు: పెళ్లి జరుగుతుండగా వరుడికి గుండెపోటు వచ్చింది. వధువు మెడలో మంగళసూత్రం కట్టిన తర్వాత అతడు కుప్పకూలి మరణించాడు. (groom dies of heart attack) పెళ్లివేడుకలో పాల్గొన్న వారంతా ఇది చూసి షాక్ అయ్యారు. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం జామ్‌ఖండి పట్టణంలో ఒక జంటకు వివాహం జరిగింది. పెళ్లితంతులో 25 ఏళ్ల వరుడు ప్రవీణ్‌కు గుండెపోటు వచ్చింది. వధువు మెడలో మంగళసూత్రం కట్టిన కొన్నిక్షణాల తర్వాత ఛాతిలో నొప్పితో అతడు కుప్పకూలిపోయాడు.
కాగా, పెళ్లికి హాజరైన బంధువులు, వరుడి స్నేహితులు ఇది చూసి షాక్ అయ్యారు. పెళ్లికొడుకు ప్రవీణ్‌ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటు వల్ల చనిపోయినట్లు భావించారు.
Wedding Ritual
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వరుడు ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ పెళ్లి వేడుకలో విషాదం నెలకొన్నది.