న్యూఢిల్లీ, జూన్ 30: రాష్ర్టాలు రుణాలు తీసుకోవడంపై సవాలక్ష నిబంధనలు విధించే మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు అక్షరాలా రూ.133.22 లక్షల కోట్లు. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఈ విషయం వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ చివరినాటికి 128 లక్షల కోట్లు అప్పు ఉండగా, ఆ తర్వాతి మూడు నెలల్లోనే కేంద్రం దాదాపు 5 లక్షల కోట్లు (3.7 శాతం) అప్పు చేసింది. ప్రధానిగా నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.55.87 లక్షల కోట్లు కాగా.. మోదీ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేండ్లలోనే దాదాపు 80 లక్షల కోట్లు కేంద్రం అప్పుచేయడం గమనార్హం. మోదీ సర్కారు ఏటా సగటున పది లక్షల కోట్ల రుణం చేస్తున్నది.