నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం: అమిత్ షా

రాయ్‌పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నారు. శనివారం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలపై నక్సలైట్లు మెరుపుదాడికి దిగి 22 మందిని చంపేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్‌తోపాటు భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా షా మీడియాతో మాట్లాడుతూ.. ‘నక్సలిజంపై పోరాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నక్సలిజాన్ని తుదముట్టిస్తాం’ అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నక్సలిజంపై చేస్తున్న పోరాటం నిర్ణయాత్మకమైన మలుపు తిరిగిందనీ, ప్రస్తుతం చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన ఈ పోరాటాన్ని మరో రెండడుగులు ముందుకు తీసుకెళ్లిందని అమిత్ షా చెప్పారు.
వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో దేశం వెనుకడుగు వేయబోదని, ఈ దాడి భద్రతాబలగాల్లో మరింత అంకితభావాన్ని పెంచుతుందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నందువల్లే ఈ దాడి జరిగినట్టు మంత్రి అభిప్రాయం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్‌ఫ్లేక్స్ తినొచ్చా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

