న్యూఢిల్లీ : ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతలపై పరిమితిని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని, దశలవారీగా దీన్ని అమలు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ శుక్రవారం వెల్లడించారు. ఏసీ కనిష్ట ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా ఉండాలని, త్వరలో దీన్ని అమలుచేయనున్నట్టు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనిపై శుక్రవారం భారత వాతావరణ సదస్సులో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి భూపేంద్ర యాదవ్ సమాధానమిస్తూ కొత్త ఏసీ ఉష్ణోగ్రత పరిమితిని అమలు చేయాల్సిన అవసరం 2050 తర్వాతే రావొచ్చన్నారు.