న్యూఢిల్లీ: విపత్తు సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం’ను పరీక్షించింది. దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ‘ఎమర్జెన్సీ అలర్ట్’ అంటూ గురువారం సందేశాలు పంపింది. పెద్ద శబ్దం.. ఫ్లాష్‌తో ఈ అలర్ట్ మెసేజ్‌లు రావటంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు గందరగోళానికి గురయ్యారు.
‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టంను పరీక్షించేందుకు పంపించాం’ అని అందులో పేర్కొనటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం’ను ఉపయోగించబోతున్నట్టు కేంద్ర టెలికం శాఖ వర్గాలు వెల్లడించాయి.