న్యూఢిల్లీ, మే 28: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర రహదారులు, పట్టణ రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్లు నిర్మించేందుకు సంబంధించిన ముసాయిదా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో అధిక రోడ్డు ప్రమాదాలకు కారణంగా ఉన్న ట్రాఫిక్‌ను వేరుచేయడం దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాయి. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారులపై పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్టు తెలిపాయి. దేశంలో చోటుచేసుకొంటున్న దాదాపు 44 శాతం రోడ్డు ప్రమాదాలు, మరణాలకు టూవీలర్లే కారణంగా ఉంటున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.