న్యూఢిల్లీ: దేశంలో 9 మంది హై-రిస్క్ వీఐపీల భద్రత విధుల నుంచి ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్ నుంచి ఆ 9 మంది హై-రిస్క్ వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్కి అప్పగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
అలాగే, ప్రత్యేక శిక్షణ పొందిన తాజా బెటాలియన్, పార్లమెంట్ భద్రతా విధుల నుంచి పక్కకు తప్పించిన బలగాలను సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్‌కు అటాచ్ చేసింది. సీఆర్పీఎఫ్, ఎన్ఎస్జీ విధుల్లో చేసిన మార్పులు నెలరోజుల్లో పూర్తి అవుతాయని కేంద్రం తెలిపింది.