న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: స్వదేశీ యుద్ధ విమానాల కొనుగోలులో అత్యంత భారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ గురువారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో కుదుర్చుకుంది. రూ.62,370 కోట్ల విలువైన ఈ ఒప్పందం కింద 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను రక్షణ శాఖకు హెచ్ఏఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఒప్పందంలో భాగంగా 68 సింగిల్-సీట్ యుద్ధ విమానాలను, 29 ట్విన్-సీట్ ట్రెయినీ విమానాలతోపాటు వాయుసేనకు ఉపయోగించే పరికరాలను హెచ్ఏఎల్ అందచేయాల్సి ఉంటుంది. తాజా ఒప్పందానికి ఆగస్టు 19న ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది.