Kapil Sibal | గవర్నర్లను బీజేపీ తన ఏజెంట్లుగా వాడుకుంటోంది.. కపిల్ సిబల్ ఘాటు వ్యాఖ్యలు
Kapil Sibal | తమిళనాడు (Tamil Nadu) లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ (Kapil Sibal) తనదైన శైలిలో స్పందించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ (BJP) తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Kapil Sibal : తమిళనాడు (Tamil Nadu) లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ (Kapil Sibal) తనదైన శైలిలో స్పందించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ (BJP) తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారుతున్నారని, ఆ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వారు తుంగలో తొక్కుతున్నారని కపిల్ సిబాల్ ఘాటుగా విమర్శించారు.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ని వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్భవన్లో కాదని, అసెంబ్లీ వేదికగా ఆయన తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సిబాల్ స్పష్టం చేశారు. గతంలో సర్కారియా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను, సుప్రీంకోర్టు స్థిరపరిచిన చట్టాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఎన్నికల తర్వాత మెజారిటీ కోసం కుదుర్చుకునే పొత్తుల కంటే ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన వారికే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని సిబల్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

