కోల్‌కతా, నవంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నెలలకొద్ది తమ వద్దే ఉంచుకోవద్దని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఉద్దేశించి ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామని బెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తెలిపింది. గవర్నర్లను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్రానికి ఇది గుణపాఠమని, ఇలాంటి వ్యవస్థను రద్దు చేయాలని పేర్కొన్నది.