శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 16:50:03

కరోనా వైరస్‌ను విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

కరోనా వైరస్‌ను విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసులు భారత్‌లో కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన రాష్ట్రాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా.. షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసివేశాయి. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో.. కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్‌-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.  

మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.  ప్రస్తుతం భారత్‌లో 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 5423 మంది కరోనా కారణంతో మృతి చెందారు. 


logo