Monthly Toll Pass | న్యూఢిల్లీ, జనవరి 15: జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాలు టోల్ చార్జీలు చెల్లించడానికి బదులుగా వాటి కోసం నెల, వార్షిక పాసులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు.
జాతీయ రహదారులపై వచ్చే మొత్తం టోల్ వసూళ్లలో 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోందని ఆయన తెలిపారు. మిగిలిన 74 శాతం రెవెన్యూ వాణిజ్య వాహనాల నుంచి వస్తుందని ఆయన చెప్పారు. ప్రైవేట్ వాహనాలకు నెల, వార్షిక పాసులను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని గడ్కరీ చెప్పారు.