న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తయారీ, దిగుమతి, వాటిని కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజా రక్షణ, భద్రతా పరమైన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. వీటి వినియోగం అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొంటూ డీపీఐఐటీ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది.
నిర్మాణ రంగం, గనుల తవ్వకం, క్వారీ పరిశ్రమల్లో ఎలక్ట్రిక్ డిటోనేటర్లను భారీగా వినియోగిస్తున్నారు. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపామని, డిటోనేటర్ల ఉత్పత్తిని 2024-2025 నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది.