వారసుడెవరో చెప్పండి.. సీజే బోబ్డేను అడిగిన కేంద్రం

న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీకాలం మరో నెల రోజులు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఓ లేఖ రాసింది. సుప్రీంకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరో చెప్పాలంటూ సీజేను కేంద్రం కోరింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఆ లేఖను రాశారు. ఏప్రిల్ 23వ తేదీన బోబ్డే రిటైర్కానున్నారు. సుప్రీంలో ఉన్న సీనియర్ జడ్జిను సీజేగా ప్రకటించడం ఆనవాయితి. అయితే ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కొత్త సీజేను ఎన్నుకుంటారు. సీజే ఇచ్చిన పేరును ప్రధాని ముందుకు న్యాయ శాఖ మంత్రి తీసుకువెళ్తారు. ఆ తర్వాతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో బోబ్డే తర్వాత సీనియర్ జాబితాలో ఉన్నవారిలో జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు. జస్టిస్ రమణ 195, ఆగస్టు 27న జన్మించారు. ఆయన 2022, ఆగస్టు 26న రిటైర్ అవుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

