న్యూఢిల్లీ, జనవరి 29 : ఏడేళ్ల కాలానికి విస్తరించిన రూ. 34,300 కోట్ల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మార్చే ప్రయాణాన్ని వేగవంతం చేయడం, ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా ఈ మిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేయనున్నది. ఈ మిషన్‌కు ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 18,000 కోట్లు సమకూరుస్తాయని ఆశిస్తున్నట్టు మైన్స్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సీ హెవీ మొలాసిస్ నుంచి తయారుచేసే ఇథనాల్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగిసే 2024-25 సంవత్సరానికి సీ హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్-మిల్లు ధరను లీటరుకు రూ.1.69 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.