LPG Allocation | రాష్ట్రాలకు 20 శాతం అదనపు ఎల్పీజీ.. కేటాయింపులకు కేంద్రం ఆమోదం
LPG Allocation | కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న ఎల్పీజీ కేటాయింపుల్లో ఇప్పటి కేటాయింపులు 50 శాతానికి చేరినట్లయ్యిందని కేంద్రం పేర్కొన్నది.
LPG Allocation : కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న ఎల్పీజీ కేటాయింపుల్లో ఇప్పటి కేటాయింపులు 50 శాతానికి చేరినట్లయ్యిందని కేంద్రం పేర్కొన్నది. అయితే వీటిలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్లు, సబ్సిడీల్లో ఆహారం అందించే కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
చమురు కంపెనీల వద్ద రిజిస్టరైన వాణిజ్య సంస్థలతోపాటు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికే ఈ అదనపు కేటాయింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. మార్చి 23 నుంచి ఈ అదనపు కేటాయింపులు సరఫరా చేస్తామని తెలిపింది. దీంతోపాటు వలస కూలీలకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు అందజేయాలని సూచించింది. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

