న్యూయార్క్ : పాకశాస్త్ర ప్రపంచంలో సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే పేరు తెలియని వారుండరు. ఎలాంటి కుకింగ్ షో లేదా ఇంటర్నెట్లో ఆయన చేయితిరిగిన చెఫ్‌లను కూడా తన సమీక్షలతో కంగుతినిపిస్తాడు. అలాంటి మాస్టర్ చెఫ్ ఎట్టకేలకు తన నోటి నుంచి ఓ డిష్‌పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఓ శాండ్విచ్ వీడియో రామ్సేను (viral video) ఆకట్టుకోగా బ్రిలియంట్ అంటూ ప్రశంసలు గుప్పించాడు. పందిమాంసం, ఎగ్‌తో తయారుచేసిన శాండ్విచ్ను తాను రివ్యూ చేస్తున్న వీడియోను చెఫ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్ ఫోర్క్‌ను ప్యాన్‌పై ఫ్రై చేయడంతో ఆరంభమవుతుంది. ఆపై అదే ప్యాన్‌పై రెండు ఎగ్స్‌ను పగలకొట్టిన కుక్ వాటిని మిక్స్ చేసి ఫ్రై చేస్తాడు.
ఆపై బ్రెడ్ ముక్కలు, చికెన్ స్లైస్‌లను జోడించి స్పైసెస్ను యాడ్ చేసి ఎగ్ శాండ్విచ్ను సర్వ్ చేయడం ఈ క్లిప్‌లో కపిపిస్తుంది. ఇది చాలా టేస్టీగా కనిపిస్తోంది..వెరీ క్లవర్ అంటూ గోర్డన్ రామ్సే చెప్పడంతో ఈ క్లిప్ ముగుస్తుంది.
Read More :
Apple Watch | బీపీ మానిటరింగ్, న్యూ డిజైన్‌తో ఆకట్టుకోనున్న యాపిల్ వాచ్ స్పెషల్ ఎడిషన్