న్యూఢిల్లీ : యాపిల్ వాచ్‌లో (Apple Watch) కీలక మార్పులతో యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోంది. 2024లో రానున్న యాపిల్ వాచ్‌లో స్నన్నింగ్ డిజైన్‌తో పాటు బీపీ మానిటరింగ్, స్లీప్ అప్నియా ట్రాకర్ వంటి రెండు కీలక హెల్త్ ఫీచర్లను ప్రవేశపెట్టనుందని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ అంచనా వేశారు. తన న్యూస్‌లెటర్ ద్వారా రాబోయే టెక్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం షేర్ చేసే గుర్మన్ తాజాగా యాపిల్ వాచ్ స్పెషల్ వెర్షన్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తావించారు.
వాచ్ యానివర్సరీ సందర్భంగా యాపిల్ న్యూ వెర్షన్‌ను తీసుకువస్తోంది. మరింత స్టైల్‌గా కనిపించేలా స్పెషల్ ఎడిషన్‌ను యాపిల్ తన కస్టమర్ల ముందుకు తీసుకువస్తుందని గుర్మన్ వెల్లడించారు. ఈ వాచ్ ప్రస్తతమున్న వాచ్‌ల కంటే విభిన్నంగా కనిపిస్తుందని కస్టమర్లు ఈ క్రేజీ డివైజ్ కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
బీపీ రీడింగ్ చూపడంతో పాటు రక్తపోటుకు సంబంధించి సమస్యాత్మకంగా మారే మార్పులపై ఈ వాచ్ అలర్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఇక నిద్రలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోయే పరిస్ధితిని పసిగట్టి హెచ్చరించే ఫీచర్ యాపిల్ వాచ్ స్పెషల్ ఎడిషన్‌లో జోడించడంతో ఇది ప్రజలకు ఉపయోగకరమైన హెల్త్ పీచర్గా ఉపకరిస్తుందని చెబుతున్నారు.
Read More :
Salaar Release Trailer | మరికాసేపట్లో ‘సలార్’ రిలీజ్ ట్రైలర్.. ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్