Google Pay | న్యూఢిల్లీ: ఇక లక్షలాది గూగుల్ పే యూజర్లు ఏఐ ఫీచర్ ద్వారా మాటలతోనే యూపీఐ చెల్లింపులు చెయ్యొచ్చు. తమ యాప్ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులను ఈ కొత్త వాయిస్ ఫీచర్ సులభతరం చేయనుందని గూగుల్ పే లీడ్ ప్రొడక్ట్ మేనేజర్(ఇండియా) శరత్ వెల్లడించారు. ఈ ఆవిష్కరణ యూపీఐ చెల్లింపుల్లో గేమ్ చేంజర్ కాగలదని భావిస్తున్నారు.
వాయిస్ ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్షరాస్యులు సైతం ఆన్లైన్ చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. కేవలం మాటలతో ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఈ కొత్త ఫీచర్ పని చేయనున్నట్టు సమాచారం.