న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ బృందాలు పనిచేస్తున్న ప్లాట్ఫామ్స్, డివైజెస్ యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. నిరుడు కొన్ని ప్లాట్ఫామ్స్, డివైజ్ టీమ్లను కలిపేశాక సేవల సామర్థ్యం పెంచడం కోసం శ్రామిక శక్తిని తగ్గిస్తున్నారు.
ఉద్యోగాల కోతలపై గూగుల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఆ ప్రక్రియను వేగంగా, ప్రభావవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుడు చేపట్టిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చర్యలకు ప్రస్తుతం చేపడుతున్న ఉద్యోగాల తగ్గింపు అదనమని తెలిపారు.