ధరిత్రీ దినోత్సవం.. ఆలోచనాత్మకంగా గూగుల్ డూడుల్
Google Doodle | ఏప్రిల్ 22.. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం. అభివృద్ధి మాటున భూమిపై రోజురోజుకు పచ్చదనం అంతరించిపోతున్నది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోయి నానాటికీ కాలుష్యం అధికమవుతున్నది. దీంతో వాతావరణంలో సమతుల్యం లోపించి
హైదరాబాద్: ఏప్రిల్ 22.. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం. అభివృద్ధి మాటున భూమిపై రోజురోజుకు పచ్చదనం అంతరించిపోతున్నది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోయి నానాటికీ కాలుష్యం అధికమవుతున్నది. దీంతో వాతావరణంలో సమతుల్యం లోపించి భూతాపం పెరిగిపోతున్నదని. రుతువులు గతితప్పడంతో కాలంతో సంబంధం లేకుండా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వరణడు పంజా విసురుతున్నాడు. సమ శీతోష్ణ మండలంలో ఉన్న భారత్‌లో కూడా శీతల గాలులు అధికమవడం, ఎండలు దంచి కొట్టడం, మూడు నెలల్లో కురవాల్సిన వాన ఒక్క గంటలోనే పడిపోవడం వంటివి మనం ప్రస్తుతం చూస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా దీనికి భిన్నంగా ఏమీలేదు. పచ్చని చెట్లతో నిండిన అమెజాన్ అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. అంటార్కిటికాలోని మంచు కరిగిపోతున్నది. దీంతో సముద్రాల్లో నీటిమట్టాలు పెరిగిపోతున్నాయి. ఇలా వాతావరణ మార్పులతో ముంచుకొస్తున్న ముప్పును సెర్చ్ ఇంజిన్ గూగుల్.. పుడమి దినోత్సవం సందర్భంగా డూడుల్ (Google Doodle) రూపంలో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నది. ప్రపంచంలోని నాలుగు మూలల్లో ఉన్న ప్రముఖ ప్రాంతాలను గూగుల్ ఎర్త్ సాయంతో తీసిన ఫొటోలను ఈ రోజు డూడుల్‌లో ప్రదర్శిస్తున్నది. గతంలో అవి ఎలా ఉన్నాయి.. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అనే చిత్రాలను ప్రతిఒక్కరు ఆలోచింప చేసేలా డూడుల్‌లో పొందుపర్చింది.

మొదటి చిత్రంలో ఆఫ్రికా ఖండంలోని టాంటానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాలను చూపించింది. 1996 నుంచి 2020 వరకు ప్రతి డిసెంబర్లో పర్వతాలు తన రూపును ఎలా కోల్పోతున్నాయో ఫొటోల్లో చూపించింది. ఇక రెండో చిత్రంలో 2000 నుంచి 2020 వరకు ప్రతి డిసెంబర్లో తీసిన చిత్రాలను ఉపయోగించి గ్రీన్‌ల్యాండ్‌లోని సెర్మర్సూక్లో హిమానీనదం కరిగిపోవడాన్ని, 2016 మార్చి నుంచి 2016 మే మధ్య ఆస్ట్రేలియాలోని లిజార్డ్ దీవుల్లో పగడపు దీవులు అంతరించి పోయిన విధానాన్ని, చివరి చిత్రంలో జర్మనీలోని ఎలెండ్లో ఉన్న హార్జ్ ఫారెస్ట్.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన కరువు కారణంగా 1995 నుంచి 2020 వరకు ఎలా నాశనమయ్యాయనే చిత్రాలను చూపించింది.
New Google Doodle has been released: "Earth Day 2022" 🙂#google #doodle #designhttps://t.co/hsBWseAYRl pic.twitter.com/FqggMiMqU8
— Google Doodles EN (@Doodle123_EN) April 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

