న్యూఢిల్లీ : గూగుల్ తన మేనేజిరియల్ స్థాయి సిబ్బందిలో 10% మందిపై వేటు వేసింది. దీర్ఘ కాలంలో సంస్థ సామర్థ్యాన్ని రెండింతలు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బుధవారం జరిగిన కంపెనీ సర్వ సభ్య సమావేశంలో సీఈవో సుందర్ పిచాయ్ ఈ మేరకు కోతల గురించి ప్రకటించినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు కోల్పోనున్న వారిలో మేనేజర్, డైరెక్టర్, ఉపాధ్యక్షుడి స్థాయి ఉద్యోగులున్నట్టు తెలిసింది. కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందడంతో గూగుల్ ఆన్లైన్ సెర్చ్ వ్యాపారానికి ప్రమాదం ఏర్పడింది.